News November 6, 2025

యాదాద్రి: తెగిపడిన విద్యుత్ వైర్లు.. వృద్ధుడు, గేదె మృతి

image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గేదెల కాపరి గొర్ల మల్లయ్య(55) రోజూ మాదిరిగానే తన గేదెలను మేపడానికి వెళ్లారు. అక్కడ ఓ వ్యవసాయ భూమిలో తెగి నేలపై పడిన కరెంటు వైర్లను గమనించకుండా, మేస్తున్న తన గేదెను పక్కకు కొట్టే ప్రయత్నంలో మల్లయ్యకు షాక్ తగిలింది. ఈ ఘటనలో మల్లయ్య, ఆయన గేదె అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News March 20, 2026

భట్టి బడ్జెట్ పై సిరిసిల్ల ప్రజల ఆసక్తి

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుండడంతో సిరిసిల్ల జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వస్త్ర పరిశ్రమకు కేటాయించే నిధులపై ఉత్కంఠ నెలకొంది. అటు కాలేశ్వరం 9, 11 ప్యాకేజీల్లో అసంపూర్తిగా మిగిలి ఉన్న కాలువల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయనే ఆశతో ఉన్నారు. వేములవాడ ఆలయ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయిస్తేనే పూర్తయ్యే అవకాశం ఉంది.

News March 20, 2026

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 75,109 వద్ద.. నిఫ్టీ 286 పాయింట్లు పుంజుకొని 23,288 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి భారీ నష్టాలతో కీలక రంగాల్లో షేర్లు ఆకర్షణీయ ధరలకే లభిస్తుండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. మరోవైపు నిన్న భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త దిగిరావడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్-30 సూచీలో HDFC షేరు మాత్రమే నష్టాల్లో ఉంది.

News March 20, 2026

VZM: ఫంక్షన్‌కు అని వెళ్లి.. మృత్యుఒడికి చేరి

image

కొత్తవలస పాత గ్రామం శ్మశానానికి వెళ్లే రహదారి <<19427690>>బందలో <<>>గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. Way2Newsలో వచ్చిన వార్తతో బాడీని ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన అల్లు కిషోర్ (39)గా బంధువులు గుర్తించారు. కిషోర్ ఈనెల 8వ తేదీన ఒడ్డిపేట ఓ ఫంక్షన్‌కి వచ్చి కనిపించలేదని తండ్రి సత్యరావు తెలిపారు. శుక్రవారం ఉదయం కిషోర్ తమ్ముడు కోటి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.