News November 6, 2025

10వ తేదీ జోగులాంబ ఆలయంలో కార్తీక సంబరాలు

image

ఈనెల 10వ తేదీ అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పరంపర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరపత్రికను విడుదల చేసింది. ఆలయాల వైభవం ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు ఉట్టిపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంబరాలు చోటుచేసుకొనున్నాయి.

Similar News

News March 20, 2026

శాంతియుత వాతావరణంలో రంజాన్ జరుపుకోవాలి: సూర్యాపేట ఎస్పీ

image

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా ముస్లిం సోదరులకు, ప్రజలకు ఎస్పీ నరసింహ ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పండుగను మతాలకు అతీతంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహపూర్వక వాతావరణంలో మెలిగి సమాజంలో శాంతి స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News March 20, 2026

గద్వాల: టెన్త్ పరీక్షలు పకడ్బందీగా జరపాలి – కలెక్టర్

image

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన, జిల్లాలో పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.

News March 20, 2026

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: సూర్యాపేట కలెక్టర్

image

2027 జనాభా గణన దేశాభివృద్ధికి, పథకాల అమలుకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తొలిసారిగా డిజిటల్ విధానంలో గణన జరుగుతుందని పేర్కొన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ ఇళ్ల జాబితా నమోదు ఉంటుందని, ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.