News November 6, 2025
కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్?

కొత్త జిల్లాలు, డివిజన్ల మార్పుచేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే అంశంపై ఉపసంఘం చర్చించింది. మంత్రి BC జనార్దన్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని పరిశీలించింది. మరోవైపు కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటుపైనా ఉపసంఘం దృష్టి సారించింది. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.
Similar News
News March 10, 2026
వేలాది కోళ్లు మృతి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

TGలోని నాగర్‌కర్నూల్(D)లో అంతుచిక్కని కారణంతో వేలాది కోళ్లు మృతి చెందాయనే సమాచారంతో AP ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోళ్లు, గుడ్లను తీసుకురావొద్దని వ్యాపారులను ఆదేశించింది. సరిహద్దుల్లోని కోళ్ల ఫారాలపై నిఘా ఉంచాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించింది. చనిపోయిన కోళ్లను పూడ్చేయాలని తెలిపింది. అలాగే కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తినాలని ప్రజలకు సూచించింది.
News March 10, 2026
KTDM: అంబులెన్స్ డ్రైవర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

మద్యం మత్తులో అంబులెన్స్ నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్‌కు పదేళ్ల శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పునిచ్చారు. భద్రాచలానికి చెందిన తోట చంద్రకళ తన కుమార్తెతో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. అంబులెన్స్ డ్రైవర్ ఆకుల దుర్గాప్రసాద్ వారిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లికూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పైతీర్పు వెలువరించింది.
News March 10, 2026
కొత్తపల్లి: కృష్ణా నదిపై కేబుల్ వంతెన

దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతుంది. కృష్ణా నదిపై సోమశిల-సంగమేశ్వరం వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోద ముద్రవేసింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం పనులు మొదలు పెట్టినంది. 800 మీటర్లు నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు రూ.1,062 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.


