News November 6, 2025
విశాఖ: డీసీసీబీలో అవినీతి ఆరోపణలు

విశాఖ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో కలకలం సృష్టిస్తోంది. పదోన్నతుల విషయంలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న గుసగుసలు వినిపించాయి. బ్యాంకులో అవినీతి అక్రమాలపై అప్కాబ్‌కు ఫిర్యాదులు అందాయి. అన్ని విధాలుగా అర్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి అర్హత లేని వారికి పదోన్నతలు ఇచ్చారన్న విమర్శలు వచ్చాయి.
Similar News
News March 20, 2026
గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
UPDATE: భద్రాచలం.. ఐదుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

భద్రాచలం: గోదావరి నదిలో స్నానానికి దిగి అమరావతిలోని SRM కాలేజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఐదుగురు <<19432137>>గల్లంత<<>>య్యారు. మొత్తం ఏడుగురు యువకులు నదిలోకి దిగగా, ఉద్ధృతికి అందరూ కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. అభిరామ్(విజయనగరం), శ్రీకర్(భద్రాచలం), తేజ(ఉయ్యూరు), సతీష్(మదనపల్లి), నవదీప్(ఉయ్యూరు) ప్రవాహంలో గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, శ్రీకర్, నవదీప్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News March 20, 2026
సంగారెడ్డి: మంజీరా నదిలో వేలాది చేపల మృత్యువాత

హత్నూర మండలం పల్పనూర్ శివారులోని మంజీరా నదిలో వేలాది చేపలు మృతి చెంది పైకి తేలడం స్థానికంగా కలకలం రేపింది. కలుషిత జలాల వల్లే చేపలు చనిపోయాయని, దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం డిమాండ్ చేశారు.


