News April 11, 2024
హమాస్ టాప్ లీడర్ కుటుంబసభ్యుల హతం

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియే కుటుంబసభ్యులు మరణించారు. గాజా స్ట్రిప్‌లో జరిగిన ఈ దాడిలో ఆయన ముగ్గురు కుమారులు అమిర్ హనియే, హజీమ్ హనియే, మహ్మద్ హనియే చనిపోయారు. వీరితోపాటు ఆయన నలుగురు మనవళ్లు కూడా ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం ఇస్మాయిల్ హనియే ఖతర్‌లో నివసిస్తున్నారు. కాగా రంజాన్ రోజు కూడా తమ దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
Similar News
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
News March 27, 2026
IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్ ఎక్కువ సంపాదించింది?

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.


