News November 6, 2025
తిరుపతి, చిత్తూరు జిల్లాలో మార్పులు..!

నగరి నియోజకవర్గాన్ని పూర్తిగా తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. నగరి డివిజన్‌లోని కార్వేటినగరం, పాలసముద్రం, పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యాన్ని చిత్తూరులో కలపనున్నారు. పుంగనూరును మదనపల్లె లేదా పీలేరు డివిజన్‌లో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. వెదురుకుప్పం, కార్వేటినగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ మీద చర్చ జరగలేదు. గూడూరును నెల్లూరు జిల్లాలోకి మార్చనున్నారు.
Similar News
News November 6, 2025
జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News November 6, 2025
ఏలూరు: ‘రెండో శనివారం సెలవు లేదు’

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులుగా నవంబర్ 8, డిసెంబర్ 13, ఫిబ్రవరి 14 తేదీల రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేయాలని జిల్లా విద్యా అధికారి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా ఈ రోజుల్లో నిర్వహించాలన్నారు.


