News November 6, 2025
ఎనుమాములలో తగ్గిన పత్తి ధర

గురునానక్ జయంతి సందర్భంగా బంద్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గురువారం ప్రారంభమైంది.
సోమవారం ₹6,920, మంగళవారం ₹6,950 పలికిన ధర, ఈరోజు ₹6,900కి పడిపోయింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు నేటి నుంచి పత్తి కొనుగోలు చేయమని కాటన్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కానీ, ఉన్నతాధికారుల ఆదేశాలతో కొనుగోళ్లు తిరిగి పునఃప్రారంభించారు.
Similar News
News March 21, 2026
నల్గొండ జీజీహెచ్‌లో వేధింపుల కలకలం..!

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్‌రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్‌సోర్సింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2,3వ ప్లేస్‌లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.
News March 21, 2026
కేయూకు బ్లాక్ గ్రాంట్ పెంపు.. రూ.20 కోట్ల అధిక కేటాయింపు

కాకతీయ యూనివర్సిటీకి 2026-27 బడ్జెట్‌లో బ్లాక్ గ్రాంట్ గత ఏడాదితో పోల్చితే సుమారు రూ.20 కోట్లు పెరిగింది. మొత్తం రూ.165.47 కోట్లు వేతనాల కోసం కేటాయించగా, ఇందులో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.129.83 కోట్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.35.64 కోట్లు ఉన్నాయి. ప్రతిపాదనల మేరకు పూర్తిస్థాయి నిధులు రాకపోయినా పెంపుపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం సంతృప్తి వ్యక్తం చేశారు.


