News November 6, 2025

మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలంటే?

image

మనం చేసే ఏ పనినైనా కృష్ణార్పణంగానే చేయాలని ఆ భగవంతుడే ఉపదేశించాడు. ఎప్పుడూ భగవంతుని పనులలోనే నిమగ్నమై ఉంటే, ఇతర ఆలోచనలకు తావుండదు. దీన్నే అవ్యభిచారిత భక్తి అంటారు. ఏకాగ్రత, నిశ్చలత కలిగిన ఈ భక్తిని శుద్ధ భక్తి, అనన్య భక్తి అని పిలుస్తారు. ఈ భక్తి మార్గం గురించి శ్రీమద్భగవద్గీతలో వివరంగా ఉంది. మనం చేసే కర్మలన్నీ భగవంతునికి అర్పించడమే నిజమైన, శుద్ధ భక్తి. వీటన్నింటి సారం తెలియాలంటే భగవద్గీత చదవాలి.

Similar News

News March 21, 2026

శ్రీశైలంలో వీడియో వైరల్.. కేసు నమోదు..!

image

శ్రీశైలం ఆలయంలోని స్వామివారి మూల విరాట్ <<19434989>>వీడియో వైరల్<<>> ఘటనను దేవస్థానం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సుబ్బారెడ్డి తెలిపారు.

News March 21, 2026

‘ధురంధర్’.. హీరో రెమ్యునరేషన్ ఎంతంటే?

image

ధురంధర్ సినిమా రెండు పార్టులకు కలిపి దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో రణ్‌వీర్ సింగ్ రూ.50 కోట్లు, సంజయ్ దత్ రూ.10 కోట్లు, మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ రూ.కోటి, సారా అర్జున్ రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్ట్-1 రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్-2 అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.

News March 21, 2026

కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

image

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?