News April 11, 2024
విజయనగరం: వడదెబ్బతో వృద్ధుడు మృతి..?

దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలోని మామాడి తోటలో బుధవారం మధ్యాహ్నం ఓ వృద్ధులు మృతి చెందాడు. వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న గత కొంతకాలంగా మతిస్తిమితం లేకుండా తిరుగుతున్నాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ తెలిపారు. వడదెబ్బకు మృతి చెంది ఉండొచ్చని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తరలించినట్లు వెల్లడించారు.
Similar News
News March 11, 2026
విజయనగరం: పోస్టల్ బీమాతో రూ.15 లక్షల ఆర్థిక సాయం

పోస్ట్ ఆఫీసు యాక్సిడెంటల్ పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని విజయనగరం పోస్టల్ సూపరింటెండెంట్ కె శ్రీనివాసు అన్నారు. మంగళవారం దత్తిరాజేరులో ప్రమాదవశాత్తు మృతి చెందిన మర్రివలస గ్రామస్థుడు కోరాడ లక్ష్మణ్ రావు కుటుంబానికి రూ.15 లక్షల బీమా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గజపతినగరం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొన్నారు. ఈ పాలసీని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అధికారులు కోరారు.
News March 10, 2026
విజయనగరం: గుండెపోటుతో ఆరోగ్యమిత్ర మృతి

విజయనగరంలో ఆరోగ్యమిత్రాగా పనిచేస్తున్న చింతల మహేశ్ (36) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. కొత్తవలస గ్రామానికి చెందిన ఈయన గత 15 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ పథకంలో సేవలందిస్తున్నారు. మహేశ్ మరణంతో ఆయనపైనే ఆధారపడిన తల్లి, చెల్లి దిక్కులేనివారయ్యారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది మహేశ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.
News March 10, 2026
VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.


