News November 6, 2025
ముల్కనూరుకు చేరిన 90 టైర్ల లారీ!

భారీ యంత్రాలను మోసుకెళ్లే అతి భారీ వాహనం HNK (D) ముల్కనూర్‌కు చేరింది. ఏకంగా 90 టైర్లతో ఉన్న లారీని చూడటానికి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గుజరాత్ నుంచి వరంగల్ వరకు ఆక్సిజన్ ప్లాంట్ సామగ్రిని ఈ భారీ వాహనం తీసుకువస్తోంది. నెమ్మదిగా కదులుతూ ముల్కనూరుకు చేరిన ఈ లారీ కుడి, ఎడమ వైపులా 40 చొప్పున 80 టైర్లు, ముందున్న ఇంజిన్‌కు 10 టైర్లు కలిగి ఉండడం విశేషం. రోడ్డుపై ఇది ప్రయాణం ప్రజలను ఆకర్షించింది.
Similar News
News March 11, 2026
GNT: అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్

అంబేడ్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో వరుస వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి టీచర్, సొంత పేరెంట్ లా మంత్రి విద్యార్థులకు ధైర్యం చెప్పి పలు సూచనలు చేశారు. మంగళవారం తాడేపల్లి AP SWREIS కార్యాలయంలో అంబేడ్కర్ గురుకులాల 10 వ తరగతి విద్యార్థులతో మంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
News March 11, 2026
కొమరాడలో YS.షర్మిల పరిరక్షణ యాత్ర

కొమరాడ మండలం కుమ్మరిగుంట పంచాయతీ డంగభద్ర గ్రామంలో ఈనెల 17న ఏపీ పీసీసీ చీఫ్ YS.షర్మిలా రెడ్డి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర (రచ్చబండ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డంగభద్ర గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.
News March 11, 2026
బాపట్ల: పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

ఇంకొల్లు స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. కేసు దర్యాప్తులో సాక్ష్యాలు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన CI రమణయ్య, ఎస్సై జి.సురేశ్, పోలీసు బృందాన్ని SP అభినందించారు.


