News April 11, 2024
విశాఖలో ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు విస్తరణ

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను విశాఖలో విస్తరించనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖలో గ్రోసరీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న జీ.ఎఫ్.సీ ద్వారా స్థానికులు వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.
Similar News
News September 13, 2025
విశాఖ: NMMS పరీక్షకు దరఖాస్తు చేశారా?

2025-26 విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ తెలిపారు. రూ.3.50 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. సెప్టెంబర్ 30వ తేదీలోగా www.bse.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష డిసెంబర్ 7న జరుగుతుంది.
News September 13, 2025
భీమిలి: బాలికపై అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు

భీమిలి ప్రాంతంలో 8 నెలల క్రితం వికలాంగురాలైన బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి పోక్సోచట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. భీమిలి ప్రాంతంలో అమ్మమ్మ దగ్గర ఉన్న మైనర్‌ను బోరా ఎల్లారావు అత్యాచారం చేశాడు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కోర్టులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
News September 13, 2025
ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌కి ఏపీ ట్రాన్స్‌కోలో అదనపు బాధ్యతలు

విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీ ఈపీడీసీఎల్ CMD పృథ్వితేజ్‌ని ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్&అడ్మిన్)గా పూర్తి అదనపు బాధ్యతలపై ప్రభుత్వం నియమించింది. ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ సభ్య కార్యదర్శిగా ఏపీ ట్రాన్స్‌కో (విజిలెన్స్ & సెక్యురిటీ) బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న కీర్తి చేకూరి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.