News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.

Similar News

News March 12, 2026

నెల్లూరు: ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్!

image

ఉదయగిరి MLAగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. 1994, 99లో కంభం విజయరామిరెడ్డి, 2014లో బొల్లినేని విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలోని జలదంకికి చెందిన వంటేరు వేణుగోపాల్ రెడ్డి కావలి నుంచి గెలిచారు. వీరంతా గత ఎన్నికల్లో TDP కోసం పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల అనుచరులకు కీలక పదవులు లభించలేదు. తమకు సైతం ప్రాధాన్యం లేదంటూ ఆ నలుగురు మాజీ MLAలు సైలెంట్‌గా ఉంటున్నారని టాక్.

News March 12, 2026

నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News March 12, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.