News November 6, 2025
విశాఖ: మహిళలను కాపాడిన లైఫ్ గార్డ్స్

RK బీచ్ గోకుల్ పార్క్ వద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న మహిళలను లైఫ్ గార్డ్స్ కాపాడారు. గురువారం ఉదయం మహారాణి పేటకు చెందిన కీర్తి ఉషారాణి, సునీత పూజా సామాగ్రిని సముద్రంలో వదలడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు కెరటాల తాకిడికి సముద్రం లోపలికి వెళ్లిపోతుండగా లైఫ్ గార్డ్స్ గమనించి వారిని రక్షించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
Similar News
News April 2, 2026
రేపు విశాఖ రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 11.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జట్టీకి వెళ్లి ఓ నౌక ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తరువాత NSTLకి వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని తిరుగుపయనం అవుతారు.
News April 2, 2026
జీవీఎంసీ వార్డుల విభజన ప్రారంభం

విశాఖలో జీవీఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 98 వార్డులను 120కి పెంచుతూ, 2011 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ మొదలైంది. ఈనెల 9లోగా ప్రక్రియ పూర్తి చేసి, మే 5లోగా గెజిట్ విడుదల చేయనున్నారు. ఒక్కో వార్డుకు సగటున 15,840 జనాభా ఉండగా, 10% వరకు అటూ ఇటూగా మార్పులకు అవకాశం ఉంది. ప్రజల అభ్యంతరాల తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ ఆమోదం పొందనుంది. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉంది.
News April 2, 2026
మధురవాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి శివశక్తి నగర్‌లో నాగదేవత గుడి సమీపంలో బుధవారం ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు అప్పుఘర్ సెక్టార్-9కు చెందిన బిలసోంతి ఉమాశంకర్ (51)గా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.


