News November 6, 2025
ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

నల్గొండ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Similar News
News November 6, 2025
పంట నష్టం నమోదు పారదర్శంగా జరుగుతుంది: కలెక్టర్

కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేవికావని కలెక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత 7 రోజులుగా అధికారుల సమక్షంలో నిరంతరంగా పారదర్శకంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
News November 6, 2025
SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేరళ

EC చేపట్టిన SIRపై TN బాటలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా SCని ఆశ్రయించనుంది. అఖిలపక్ష సమావేశంలో CM పినరయి విజయన్ దీన్ని వెల్లడించారు. BJP మినహా ఇతర పక్షాలన్నీ దీన్ని ఆమోదించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితా రెడీగా ఉన్నా EC 2002 నాటి జాబితా ప్రకారం SIR నిర్వహించబోవడాన్ని తప్పుబట్టాయి. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నాయి. EC ఇలా చేయడం వెనుక రహస్యాలున్నట్లేనని ధ్వజమెత్తాయి.
News November 6, 2025
రైతులు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి నాదెండ్ల

AP: ఈ క్రాప్‌లో నమోదైన ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెట్టుబడి రాయితీ చెల్లిస్తే.. ఆ సర్వే నంబరులో సాగు చేసిన పంటను కొనుగోలు చేయరంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఈ నెలలో 11 లక్షలు, DECలో 25 లక్షలు, JANలో 8 లక్షలు, FEBలో 3 లక్షల మె.టన్నులు, మార్చిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.


