News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

image

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.

Similar News

News March 5, 2026

ట్రంప్‌కు షాక్.. వసూలు చేసిన టారిఫ్స్ రిఫండ్!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు US ట్రేడ్ కోర్ట్ షాకిచ్చింది. కంపెనీల నుంచి వసూలు చేసిన అదనపు టారిఫ్‌ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఎమర్జెన్సీ పవర్ లా కింద టారిఫ్స్ చెల్లించిన అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుందని, రిఫండ్‌కు వారు అర్హులని స్పష్టం చేసింది. ఈ మొత్తం $175B ఉంటుందని అంచనా. కాగా అంతకుముందు ట్రంప్ టారిఫ్స్‌ను US సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

News March 5, 2026

వాంఖడే పిచ్‌ ఎవరికి కలిసొస్తుందో?

image

ఈరోజు IND-ENG సెమీస్‌లో వాంఖడే పిచ్ కండీషన్ ముఖ్యపాత్ర పోషించనుంది. సాధారణంగా ఇది బ్యాటింగ్ పిచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు పరుగుల వరద పారించొచ్చు. అయితే ఇప్పుడు ఆ పిచ్‌పై పచ్చిక ఉండటం చర్చనీయాంశమైంది. దీనిపై కోచ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, సిబ్బంది పచ్చికను తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చిక ఎక్కువుంటే పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అదే తేమ ఎక్కువైతే బ్యాటర్లకు కలిసొస్తుంది.

News March 5, 2026

ఇవాళ, రేపూ భారీ నష్టాలు తప్పవా?

image

ఇరాన్ వార్‌తో భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. చివరి 3 సెషన్లలో ఏకంగా రూ.21.29 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత శనివారం యుద్ధం ప్రారంభం కాగా మరుసటి రోజు ఆదివారం, 3న(మంగళవారం-హోలీ) మార్కెట్లకు సెలవులు కావడంతో మరింత భారీ నష్టం తప్పింది. అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుండటం, ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇవాళ, రేపటి సెషన్లపై ‘బేర్’ పంజా తప్పేలా లేదు.