News November 6, 2025
అల్లు అర్జున్ నుంచి భారీ ప్రాజెక్టులు!

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని పాన్ వరల్డ్ రేంజ్‌లో 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బన్నీ ఏయే ప్రాజెక్టులు చేయబోతున్నారు అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్ట్‌లో సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను(సరైనోడు 2) పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ భారీగా ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 16, 2026
పొలంలో ఎలుకల నిర్మూలనకు ముందు ఏం చేయాలి?

వ్యవసాయంలో వాతావరణ పరిస్థితులు, చీడపీడల తర్వాత ఎలుకలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. పొలాల్లోని కలుగుల్లో ఉండే ఎలుకలను పొగబెట్టడం, రసాయన ఎరలు, ఎర స్థావరాల ఏర్పాటుతో నివారించవచ్చు. అయితే ఎలుక కన్నాల సంఖ్యను బట్టి నివారణా చర్యలు చేపట్టాలి. దీనికి ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అలాగే పొలం గట్లమీద ఉండే పొదలను తొలగించాలి. గట్లను పారతో చెక్కి తర్వాత ఎలుకల నిర్మూలన చర్యలు చేపట్టాలి.
News March 16, 2026
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.
News March 16, 2026
ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ సినిమా ఇదే

‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. లాస్ ఏంజెలిస్‌లో జరుగుతున్న అకాడమీ వేడుకలో విజేతగా నిలిచింది. ‘టైటానిక్’ హీరో డికాప్రియో ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమాలో నటనకు షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా, కాస్టింగ్ విభాగంలో కస్సాండ్రా అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ నటుడిగా మైకేల్ బి జోర్డాన్(సిన్నర్స్), ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ(హామ్నెట్) నిలిచారు.


