News November 6, 2025
శాతవాహన రైలు లింగంపల్లి వరకు పొడిగించాలని డిమాండ్

శాతవాహన రైలు లింగంపల్లి వరకు పొడిగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాచిగూడ, బేగంపేట, హైటెక్ సిటీ మార్గంలో భారీగా ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో ఈ రైలు లింగంపల్లి వరకు నడిస్తే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైలు పొడిగింపు కోసం రైల్వే అధికారులను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News March 14, 2026
మెదక్: ‘ఎస్సీలకు ఆర్థిక సాయం..17లోగా దరఖాస్తు చేసుకోండి’

మెదక్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ. 236.60 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీని ద్వారా 249 మందికి లబ్ధి కలగనుంది. ఇందులో 119 ఈవీ బైక్‌లు, 59 ఆటో రిక్షాలు, 12 వ్యవసాయ యూనిట్లు కేటాయించారు. ఆసక్తిగల వారు ఈ నెల 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్‌కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 14, 2026
విశాఖ: ‘నేడు పాఠశాలల సెలవు రద్దు’

జిల్లాలో మార్చి రెండో శనివారం ఇవ్వాల్సిన సెలవును రద్దు చేస్తూ డీఈఓ ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘మొంథా’ తుపాన్ ప్రభావంతో వరుస సెలవులు ప్రకటించడంతో, ఆ రోజుకు బదులుగా ఈరోజు పని దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. అధికారులు, ప్రధానోపాధ్యాయులు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.


