News November 6, 2025

వేములవాడ: పరిహారం ఇవ్వండి.. లేదా గెజిట్ నుంచి తొలగించండి..!

image

నష్టపరిహారం చెల్లించకుండా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే లైన్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేములవాడలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు అమ్ముకునేందుకు వీలుగా గెజిట్ నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లించకుండా, గెజిట్ నుంచి తొలగించకుండా తాత్సారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 11, 2026

విశాఖ జిల్లాలో రికార్డ్ లెవల్లో రిఫండ్.. ఎన్ని కోట్లంటే?

image

సైబర్ నేరాల బాధితులకు రిఫండ్ అందించడంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో 1,240 మంది బాధితులకు రూ. 22.47 కోట్లు రిఫండ్ చేయగా, 558 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లోన్ యాప్ కేసుల్లో రూ. 60 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్నారు. మోసపోతే తక్షణమే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

News March 11, 2026

టెన్త్ ఎగ్జామ్స్.. 19,835 మంది విద్యార్థులు: నల్గొండ DEO

image

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.

News March 11, 2026

కొత్త ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలి: అడ్లూరి

image

పెద్దపల్లి మండలం రంగాపూర్ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. నాలుగు గ్యారంటీలు అమలు అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు.