News November 6, 2025

కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News March 12, 2026

నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News March 12, 2026

కడప జిల్లాలో MSPతో శనగ పంట సేకరణ ఎంతంటే.!

image

కడప జిల్లాలో బుధవారం నాటికి 2438 మంది రైతుల నుంచి MSPతో 9963MTల శనగలను సేకరించారు. పెద్దముడియం-727, జమ్మలమడుగు-593, మైలవరం-267, ఎర్రగుంట్ల-782, కొండాపురం-335, ముద్దనూరు-822, ప్రొద్దుటూరు-630, రాజుపాలెం-724, కమలాపురం-1120, వల్లూరు-532, పెండ్లిమర్రి-811, VNపల్లె-603, పోరుమామిళ్ల-145, దువ్వూరు-93, వేంపల్లె-332, వేముల-530, సింహాద్రిపురం-217, తొండూరు-176, లింగాల-255, పులివెందుల-262MTలు సేకరించారు.

News March 11, 2026

కడప: వీరికి డాక్టరేట్లు ఇవ్వనున్న వైవీయూ

image

YVU స్నాతకోత్సవంలో ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. తేలికపాటి యుద్ధ విమానాల రూపకర్త డా.కోటా హరినారాయణ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి ప్రెసిడెంట్ డా. శేఖర్. సి. మండేలకు గౌరవ డాక్టరేట్‌లను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేస్తారన్నారు. వీరి జీవితం నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.