News April 11, 2024
నెల్లూరు జిల్లాలో 20.48 లక్షల మంది ఓటర్లు

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 20,48,252 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. వీరిలో 10,02,144 మంది పురుషులు, 10,45,917 మంది మహిళలు, 211 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరించగా 7,932 పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. కొత్తగా ఓటు నమోదుకు ఈ నెల 14 వరకు దరఖాస్తులు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
ట్రెడిషనల్ లుక్‌లో నెల్లూరు కలెక్టర్

నెల్లూరు కలెక్టరేట్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఉగాది వేడుకలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కవులు, కళాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పండితులు పంచాంగ శ్రవణం చదువుతున్నారు. కలెక్టర్ ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది.
News March 19, 2026
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ MLA

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.
News March 19, 2026
ఎండలు.. నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, పాఠశాలల్లో వాటర్ బెల్, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.


