News November 6, 2025

మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.

Similar News

News April 2, 2026

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామంలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పేదవాడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామసభలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సక్రమంగా తీర్మానాలు చేయాలని అధికారులకు సూచించారు.

News April 2, 2026

మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

image

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.

News April 2, 2026

మనోహరాబాద్: సబ్బుపై హనుమాన్ రూపం

image

హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రకారుడు సబ్బుపై హనుమాన్ చిత్రం చెక్కారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు బ్రహ్మచారి సబ్బుపై వీర హనుమాన్ రూపాన్ని చెక్కి తన భక్తిని చాటుకున్నారు. చిత్ర లేఖనంతో విద్యార్థుల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.