News November 6, 2025

గన్నవరం: ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

image

ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల నుంచి ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తొలిసారి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో చిన్నారులు భావోద్వేగానికి లోనయ్యారు. సమగ్ర శిక్షా, ఏపీ సైన్స్ సిటీ సంయుక్తంగా చేపట్టిన మూడు రోజుల సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా జాతీయ మ్యూజియం, ప్లానెటోరియం సందర్శిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు.

Similar News

News March 24, 2026

NZB: వేసవి తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్

image

వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు పురమాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News March 24, 2026

హరీశ్ రాణా చనిపోయారు

image

13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ AIIMSలో ఇవాళ కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 100 శాతం కోమాలో ఉండటంతో హరీశ్ రాణాకు కారుణ్య మరణం(<<19390967>>Passive Euthanasia<<>>) కింద వైద్య సహాయాన్ని <<19352489>>నిలిపివేసేందుకు<<>> సుప్రీంకోర్టు ఇటీవల అనుమతించింది. దేశంలో ఇలాంటి కేసు ఇదే మొదటిది. ఈ క్రమంలో హరీశ్‌కు లైఫ్ సపోర్ట్‌ను AIIMSలో ప్రత్యేక వైద్య బృందం క్రమంగా తొలగించింది.

News March 24, 2026

మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

వచ్చే నెలలో జరగనున్న బాబు జగ్జీవన్ రామ్(ఏప్రిల్ 5), డా. బి.ఆర్. అంబేడ్కర్(ఏప్రిల్ 14) జయంతి వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో వేడుకలను జయప్రదం చేయాలని సూచించారు.