News November 6, 2025
ఏకగ్రీవ ఎన్నిక ఓటుస్వేచ్ఛను దెబ్బతీయడం కాదు: కేంద్రం, ఈసీ

ఓటు స్వేచ్ఛ ఓటు హక్కుకు భిన్నమైనదని కేంద్రం, ECలు సుప్రీంకోర్టుకు నివేదించాయి. ఒక్క అభ్యర్థే ఉన్నప్పుడు ఏకగ్రీవ ఫలితం ప్రకటించడమంటే ‘నోటా’ అవకాశాన్ని కాదనడమేనన్న పిటిషన్‌పై అవి సమాధానమిచ్చాయి. ‘ఓటుహక్కు చట్టబద్ధం. ఓటుస్వేచ్ఛ రాజ్యాంగ హక్కు. పోలింగ్ జరిగినప్పుడే ఓటు స్వేచ్ఛ వర్తిస్తుంది’ అని పేర్కొన్నాయి. పోలింగే లేనప్పుడు రాజ్యాంగహక్కును దెబ్బతీసినట్లు కాదని తెలిపాయి. దీనిపై SC విచారణ చేపట్టింది.
Similar News
News March 20, 2026
సీక్వెల్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏంటి?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తోంది. సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా సినిమాలు తీయడం పెరుగుతోంది. ఈ జాబితాలో బాహుబలి, KGF, పుష్ప, కాంతార(ప్రీక్వెల్), డీజే టిల్లు, అఖండ, కార్తికేయ, ఇస్మార్ట్ శంకర్, దృశ్యం, F2, పొన్నియన్ సెల్వన్, హిట్, పొలిమేర, మత్తు వదలరా, మ్యాడ్, తాజాగా ధురంధర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సీక్వెల్ ఏంటో కామెంట్ చేయండి.
News March 20, 2026
ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 పెంపు

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై రూ.22 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రూ.87.57 ఉన్న ధర రూ.109.59కి చేరింది. ఈ డీజిల్‌ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరేషన్‌లో ఉపయోగిస్తారు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్, రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.
News March 20, 2026
స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.


