News November 6, 2025
ఇజ్రాయెల్‌లో JOBS.. రేపు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు

ఇజ్రాయెల్ దేశంలో సెరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్ వర్క్, బ్లాక్ బిల్డర్స్(మేసన్స్), జిప్సం వర్క్, ఉద్యోగాల కోసం రేపు నిజామాబాదులో ఎన్రోల్మెంట్, అవగాహనా డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. 21 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండి, 10వ తరగతి పాసైనవారు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు కోరారు. VENUE- జిల్లా ఉపాధి కార్యాలయం నిజామాబాద్. CONTACT- 9959456793.
Similar News
News March 20, 2026
NZB: అంతరిస్తోన్న పిచ్చుకల కోసం ఫీడర్లు

ఒకప్పుడు మన ఇంటి ముంగిట సందడి చేసిన పిచ్చుకలు నేడు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని సంరక్షించాలన్న ఉద్దేశంతో నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు Md దిలావర్ కృషితో 2010లో మొదటి సారిగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. NZBకు చెందిన మంచాల జ్ఞానేందర్ పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెట్టేలా ఫీడర్లు పంపిణీ చేస్తున్నారు.
News March 20, 2026
నిజామాబాద్: ఆరుతున్న సామాన్యుడి పొయ్యి!

యుద్ధం ఎక్కడో జరుగుతుండవచ్చు, కానీ దాని సెగ ఉమ్మడి నిజామాబాద్‌లోని సామాన్యుడి వంటింట్లో కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం సాకుతో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన జాప్యం, ఇక్కడి పేదవాడి కడుపు కొడుతోంది. గత 30 రోజుల్లో అధికారులు 156 సిలిండర్లను పట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్మూర్, బోధన్ వంటి ప్రాంతాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో సబ్సిడీ గ్యాస్‌ను వాడుతూ పట్టుబడ్డారు.
News March 20, 2026
NZB: విచారణ పూర్తి.. ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేత: DEO

10వ తరగతి పరీక్షల్లో భాగంగా నిన్న బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రశ్నా పత్రం లీక్ ఘటనకు సంబంధించి ఈ రోజు విచారణ పూర్తి అయ్యిందని DEOఅశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో లీక్ అవాస్తవమని తేలిందన్నారు. ఈ మేరకు సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్ కె.వేణు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఏ. శివానంద్ రావుపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు DEO తెలిపారు


