News November 6, 2025

WGL: క్వింటా పసుపు రూ.11,738

image

చాలా రోజుల అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు గురువారం పసుపు తరలివచ్చింది. ఈ క్రమంలో క్వింటా పసుపుకు రూ.11,738 ధర వచ్చింది. అలాగే మొక్కజొన్న సైతం తరలిరాగా రెండు రోజులతో పోలిస్తే ధర భారీగా పడిపోయింది. సోమవారం మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,095, మంగళవారం రూ.2,055 ధర వస్తే.. ఈరోజు రూ.2,010 కి పతనమైంది. అలాగే దీపిక మిర్చి రూ.15,500 ధర వచ్చింది.

Similar News

News November 6, 2025

పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.

News November 6, 2025

KMR: మిడ్ డే మీల్స్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని వినతి

image

పెండింగ్‌లోని బిల్లులను వెంటనే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు డిమాండ్ చేశారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. MDM నిర్వహణ కమిటీ అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.8 కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు.

News November 6, 2025

SRD: ‘సైబర్ మోసాలకు గురైతే ఇలా చేయండి’

image

విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సంగారెడ్డి మండలం పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెల్ ఫోన్లలో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే https://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు.