News November 6, 2025

జాతీయస్థాయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అమలాపురం విద్యార్థి

image

అమలాపురానికి చెందిన 8వ తరగతి విద్యార్థి గోసంగి సందీప్ అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-19 విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన సందీప్ జాతీయస్థాయి జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయురాలు యెనుముల కనకదుర్గా విశ్వం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం అభినందించారు.

Similar News

News November 6, 2025

ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలి: NZB కలెక్టర్

image

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని ప్రతి విద్యార్థికి సంబంధించిన వివరాలను యూడైస్‌లో నమోదు చేయాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం విద్యా శాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపల్స్, HMలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం వారి వివరాలను యూడైస్‌లో నిక్షిప్తం చేయిస్తోందన్నారు.

News November 6, 2025

రేపు ‘వందేమాతరం’ సామూహిక గీతాలాపన: NZB కలెక్టర్

image

వందేమాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని శుక్రవారం సామూహిక గీతాలాపన ఉంటుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. వందేమాతరం గీతానికి గల ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు వీలుగా చేపడుతున్న వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని విధిగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News November 6, 2025

విద్యార్థులను ప్రోత్సహించడానికే చెకుముకి పోటీలు: డీఈవో

image

విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా చెకుముకి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సంగారెడ్డిలోని డీఈవో కార్యాలయంలో చెకుముకి పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోటీలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సూచించారు.