News November 6, 2025

‘మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్’ ప్రారంభం

image

భద్రాద్రి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా, సురక్షితంగా, పిల్లల స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోడల్ అంగన్వాడీ డిజైన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్రస్తుత అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించినప్పుడు సౌకర్యాలు, భద్రత, సౌందర్యం, ప్రాప్యత, పర్యావరణ స్థిరత్వం వంటి అంశాల్లో మెరుగుదలకు విస్తృత అవకాశాలు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

ఫర్నిచర్ శిక్షణ కోసం 19 మంది ఎంపిక

image

భద్రాద్రి కలెక్టరేట్లో NSTI, FFSC, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్టీపర్పస్ అసిస్టెంట్ ఫర్ ఫర్నిచర్ ప్రొడక్షన్ & ఇన్స్టాలేషన్ శిక్షణ కోసం డ్రాయింగ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఎంపికల కోసం ఆన్లైన్లో 69 మంది పేరు నమోదు చేసుకోగా మొత్తం 29 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల ఆధారంగా 19 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.

News November 6, 2025

పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News November 6, 2025

కొడంగల్: నేషనల్ రోడ్ల నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ నుంచి చించోలికి నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నేషనల్ హైవేలో విలువైన భూములు, కట్టడాలు పోతున్న బాధితులతో కలెక్టర్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. నేషనల్ హైవేలో నష్టం జరుగుతున్న బాధితులు సమ్మతిస్తే వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు.