News November 6, 2025
‘పోలీస్ శాఖపై గౌరవం పెరిగేలా విధులు నిర్వర్తించాలి’

జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పదోన్నతి, బదిలీపై నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుంచి బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని అన్నారు. సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, గౌరవాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని SP కోరారు.
Similar News
News March 25, 2026
SRH vs RCB.. తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌తో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులో జరిగే ఈ పోరుకు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. పగలు 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా.. సాయంత్రం మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశం 60 శాతం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురుగాలుల వల్ల ఆటకు అంతరాయం కలగొచ్చని చెప్పింది. దీంతో మ్యాచ్ ఆలస్యం అయ్యేందుకు ఆస్కారముంది.
News March 25, 2026
జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
News March 25, 2026
మచిలీపట్నం RTA ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో అక్రమాలపై అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.


