News November 6, 2025

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి అత్యల్పంగా గోవిందారం, మన్నెగూడెంలో 18.4℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గొల్లపల్లి, పూడూర్, కథలాపూర్ 19, మద్దుట్ల 19.2, పెగడపల్లి 19.3, తిరుమలాపూర్ 19.4, మల్యాల, జగ్గసాగర్, రాఘవపేట 19.5, మల్లాపూర్, కోరుట్ల 19.6, నేరెళ్ల, రాయికల్, ఐలాపూర్ 19.7, గోదూరు, పొలాస, సారంగాపూర్ 19.8, మేడిపల్లి 19.9, జగిత్యాలలో 20.1℃గా నమోదైంది.

Similar News

News November 6, 2025

ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

image

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.

News November 6, 2025

వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

image

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>

News November 6, 2025

సురవరం ప్రతాప్‌రెడ్డి వర్సిటీలో యువకుడి ఆత్మహత్య

image

బాచుపల్లి PS పరిధిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో కలకలం రేగింది. పోలీసుల వివరాలిలా.. బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్ కోర్సులో 3rd ఇయర్ చదువుతున్న పరశురాం అనే వ్యక్తి హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.