News November 6, 2025
పిరం కానున్న కొండగట్టు అంజన్న దర్శనం

జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పేరిట ఆర్జిత సేవల టికెట్ల ధరలను భారీగా పెంచారు. దీంతో భక్తులకు అంజన్న దర్శనం ‘పిరం’గా మారనుంది. కాగా, అభివృద్ధి అంటే భక్తులకు కనీస వసతులు కల్పించడమా.. లేక ఛార్జీలు పెంచడమా.. అని భక్తులు మండిపడుతున్నారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు ఓ పక్క కనీస అవసరాలు లేక అల్లాడిపోతుంటే.. పెంచిన ఈ ఛార్జీలు మరింత భారం కానున్నాయి.
Similar News
News March 7, 2026
సివిల్స్‌లో కర్నూలు యువకుడికి 297వ ర్యాంకు

కర్నూలుకు చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. తన ర్యాంకుకు ఐఏఎస్ వస్తే వెళ్తానని, లేదంటే మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
News March 7, 2026
విజయవాడ: తండ్రి సీఐ.. కుమార్తెకు సివిల్స్‌లో 520 ర్యాంక్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అహోరాత్రులు శ్రమించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. విజయవాడకు చెందిన సీఐ సుధాకర్ కుమార్తె హర్షిత 520వ సాధించి సత్తాచాటారు. తాను 2022 సంవత్సరం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు హర్షిత తెలిపారు. ఈ మేరకు ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.
News March 7, 2026
WGL: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం.


