News November 6, 2025
వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి

TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం బోరబండకు వస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తా. కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. తన మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే తాము అనుమతి రద్దు చేశామనేది తప్పుడు ప్రచారమని, తమను ఎవరూ అనుమతే కోరలేదని పోలీసులు తెలిపారు.
Similar News
News November 6, 2025
స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.
News November 6, 2025
ట్రంప్ ఉక్కుపాదం.. 80వేల వీసాల రద్దు

అక్రమ వలసదారులతోపాటు వీసాలపై వచ్చి ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారిపైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. జనవరి నుంచి 80వేల వీసాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. హింస, దాడులు, చోరీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు ముగిసినా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను లెక్కచేయని 6వేలకు పైగా స్టూడెంట్ల వీసాలూ రద్దయినట్లు మీడియా తెలిపింది.
News November 6, 2025
వాణిజ్య కూడళ్ల సమీపంలో నివాసం ఉండొచ్చా?

బహుళ అంతస్తుల భవనాల సమీపంలో, వాణిజ్య కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో నివాసం ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ ప్రాంతాలలో నిరంతర శబ్దం వల్ల అధిక ప్రతికూల శక్తి వస్తుందంటారు. ‘ఇది ఇంటికి శాంతిని, నివాసితులకు ప్రశాంతతను దూరం చేస్తుంది. వ్యాపార కూడళ్ల చంచలత్వం నివాస స్థలంలో స్థిరత్వాన్ని లోపింపజేస్తుంది. శుభకరమైన జీవనం కోసం ఈ స్థలాలకు దూరంగా ఉండాలి’ అని చెబుతారు. <<-se>>#Vasthu<<>>


