News November 6, 2025
పెద్దపల్లి: SC సంక్షేమ శాఖపై కలెక్టర్ సమీక్ష

PDPL కలెక్టర్ కోయ శ్రీహర్ష SC సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చిమొక్కలు తొలగించి పారిశుధ్యాన్ని కాపాడాలన్నారు. మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. నాణ్యమైన ఆహారం, మెనూ అమలు, స్కాలర్షిప్ దరఖాస్తుల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.
Similar News
News November 6, 2025
MHBD: బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రాంబాబు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య మమత తెలిపిన వివరాలిలా.. 15ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రాంబాబు ఈ మధ్య కాలంలో విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండటంతో పలుమార్లు ఉన్నత అధికారులు హెచ్చరించినా తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న రాంబాబు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News November 6, 2025
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1500 ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) పీవీ కాలనీకి చెందిన సూరపాక రామనాథం(60)ను అదే కాలనీకి చెందిన చెవుల సురేష్ మద్యం మత్తులో కర్రతో కొట్టి చంపారు. కుమారుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. 11 మంది సాక్షులను విచారించగా సురేష్ పై నేరం రుజువు కావడంతో ఈ రోజు శిక్ష పడింది.
News November 6, 2025
‘Google Photos’లో అదిరిపోయే ఫీచర్

చాలామంది తమ ఫోన్‌లో దిగిన ఫొటోలను ఫ్రెండ్స్‌కు పంపేందుకు వాట్సాప్ వాడతారు. ఇలా చేస్తే ఫొటోల క్లారిటీ తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గూగుల్ ఫొటోస్’ యాప్‌లో డైరెక్ట్‌గా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీకి యాక్సెస్ ఇవ్వొచ్చు. దీనికోసం <


