News November 6, 2025
భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.
News March 19, 2026
భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
News March 19, 2026
తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.


