News November 6, 2025

క్వాయర్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోండి: కలెక్టర్

image

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ప్రాంతీయ సదస్సును గురువారం కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం నిర్వహించి మాట్లాడారు. కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగవుతుందన్నారు. కేవలం కొబ్బరికాయలు మాత్రమే విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. క్వాయర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలన్నారు.

Similar News

News March 25, 2026

రహదారి ప్రమాదాల నివారణకు ‘స్టాప్ అండ్ గో వాష్’

image

అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘స్టాప్ అండ్ గో వాష్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. SP రాహుల్ మీనా ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై బుధవారం తెల్లవారుజామున వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.

News March 25, 2026

మంథని JNTUHకి 16 ఏళ్లు..!

image

గ్రామీణ యువతకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించాలనే సంకల్పంతో మార్చి 25, 2010న మంథని JNTUHని అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. PDPL(D) రామగిరి(M) కల్వచర్లలో NAAC- ‘A+’ గ్రేడ్ గుర్తింపుతో, 52 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీ, హాస్టల్ వసతులతో అందుబాటులో ఉన్నాయి. ఈ నిర్మాణానికి సింగరేణి సహకారం అందించినందుకు ఉద్యోగుల పిల్లలకు 10% సీట్లను ప్రభుత్వం కేటాయించింది.

News March 25, 2026

విజయవాడ: రూ. 2 కోట్ల ఆశచూపి రూ.36 లక్షలు కొట్టేశాడు..!

image

పెట్టుబడుల పేరుతో హనుమంతరెడ్డి అనే వ్యక్తిని హరిప్రసాద్ అనే కేటుగాడు దారుణంగా మోసగించాడు. బందర్ రోడ్డులో రూ. 2 కోట్ల నగదు ఉందంటూ ఓ సూట్‌కేస్ ఇచ్చి, ప్రతిగా హనుమంతరెడ్డి వద్ద ఉన్న రూ.36 లక్షలు తీసుకుని ఉడాయించాడు. తీరా సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు ఉండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.