News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటల ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
MHBD: బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రాంబాబు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య మమత తెలిపిన వివరాలిలా.. 15ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రాంబాబు ఈ మధ్య కాలంలో విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండటంతో పలుమార్లు ఉన్నత అధికారులు హెచ్చరించినా తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న రాంబాబు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News November 6, 2025
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1500 ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) పీవీ కాలనీకి చెందిన సూరపాక రామనాథం(60)ను అదే కాలనీకి చెందిన చెవుల సురేష్ మద్యం మత్తులో కర్రతో కొట్టి చంపారు. కుమారుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. 11 మంది సాక్షులను విచారించగా సురేష్ పై నేరం రుజువు కావడంతో ఈ రోజు శిక్ష పడింది.
News November 6, 2025
‘Google Photos’లో అదిరిపోయే ఫీచర్

చాలామంది తమ ఫోన్‌లో దిగిన ఫొటోలను ఫ్రెండ్స్‌కు పంపేందుకు వాట్సాప్ వాడతారు. ఇలా చేస్తే ఫొటోల క్లారిటీ తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గూగుల్ ఫొటోస్’ యాప్‌లో డైరెక్ట్‌గా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీకి యాక్సెస్ ఇవ్వొచ్చు. దీనికోసం <


