News November 6, 2025

ఏలూరు: రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

image

ఏలూరులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి ఈస్ట్ కోస్ట్ రైలు నుంచి జారిపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ మాస్టర్ సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి, స్కై బ్లూ చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలని రైల్వే హెచ్‌సీ శ్రీనివాసరావు కోరారు.

Similar News

News April 9, 2026

GNT: బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నవ బాలయ్య

image

ప్రముఖ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా చావపాడులో 1930 ఏప్రిల్ 9న జన్మించారు. ఇంజినీరింగ్ చదివిన ఆయన 1958లో ‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. తన కెరీర్‌లో 350కి పైగా విభిన్న చిత్రాల్లో నటించారు. అమృతా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించారు. అనారోగ్యంతో తన 92వ పుట్టినరోజైన 2022 ఏప్రిల్ 9న ఆయన మృతి చెందారు.

News April 9, 2026

కేజీహెచ్‌లో వార్డు బాయ్‌పై మేల్ నర్స్ దాడి..!

image

KGHలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంట్రాక్ట్‌ మేల్ నర్స్ పైడ్రాజు తనపై దాడి చేసినట్లు వార్డ్ బాయ్‌‌ అప్పలస్వామి ఆరోపించారు. తన మనవరాలు ప్రియాంక (పేషెంట్‌)ను ఆస్పత్రిలో చేర్చారు. సెలైన్ సరిగా పెట్టకపోవడంతో ఇబ్బంది పడినట్లు ప్రియాంక తన తాతకు చెప్పింది. దీంతో అక్కడే ఉన్న పైడ్రాజుని అడగ్గా తనపై దాడి చేసినట్లు అప్పలస్వామి చెప్పారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపారు.

News April 9, 2026

HYD: DANGER.. ఈ బాటిల్స్‌లో వాటర్..!

image

HYDలో నాసిరకం, కల్తీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. వేసవిలో బయట ఎక్స్‌పైర్డ్, నాసిరకం వాటర్ బాటిల్‌ కొని తాగితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరించారు. బాటిల్‌పై ట్రయాంగిల్‌లో 1 ఉంటే అది సింగిల్ యూజ్. రెండోసారి వాడితే క్యాన్సర్ కారకాలు విడుదలవుతాయి. 3, 6, 7 ఉంటే నాసిరకం ప్లాస్టిక్. 2, 4, 5 ఉంటే 6నెలల వరకు వాడొచ్చు. రంగు మారితే పడేయాలి. స్టీల్, కాపర్ బాటిల్ క్యారీ చేయడం బెటర్.
#SHAREIT