News November 6, 2025

వేములవాడ: రాజన్నను మొక్కాకే ముందుకు..!

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఓ ఆనవాయితీ ఉంది. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా ఉత్తర తెలంగాణలోని ప్రజలు ముందుగా రాజన్నను దర్శించుకుంటారు. రాజన్నను దర్శించుకోవడంతో తమ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుందని భక్తుల నమ్మకం. అయితే దర్శనాలు నిలిపేస్తారు అనే పుకార్లు, మరో 2నెలల్లో మేడారం జాతర రానుండడంతో భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో రాజన్న దర్శనానికి వస్తున్నారు.

Similar News

News March 17, 2026

బెంగాల్‌లో బిగ్గెస్ట్ ఫైట్.. మమత vs సువేందు

image

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హైవోల్టేజ్ ఫైట్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ సౌత్ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. APR 23 నుంచి 29 మధ్య రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు ఈసారి ఆమె సొంత నియోజకవర్గంలోనే పోటీకి దిగడం గమనార్హం.

News March 17, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.

News March 17, 2026

ఈ నెల 22న ఖమ్మం బంద్‌కు పిలుపు

image

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘ఖమ్మం బంద్’కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.