News November 6, 2025
బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్‌లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.
Similar News
News March 20, 2026
లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ..

నాసిక్ (MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ (67) కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ‘మంచి భర్త దొరకాలని 2022లో ఓ యువతి సంప్రదించింది. ఆమెకు ఓ తాయత్తు ఇచ్చి తీయవద్దని చెప్పాడు. పరీక్ష కోసం తీయగా వారంలో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. దీంతో ఆమెకు నమ్మకం పెరిగింది. ఇదే అదనుగా అశోక్ మత్తుమందు ఇచ్చి రేప్ చేశాడు. లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ 2025 వరకు వేధించాడు’ అని పోలీసులు తెలిపారు.
News March 20, 2026
జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును ఆర్డర్‌పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
News March 20, 2026
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <
Share It


