News November 6, 2025

పరకామణి కేసుపై సమగ్ర దర్యాప్తు: రవిశంకర్

image

AP: తిరుమలలో పరకామణి <<18117294>>చోరీ కేసుపై<<>> హైకోర్టు ఆదేశాలతో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని CID DG రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు. ఇప్పటికే పరకామణి భవనం, CCTV కమాండ్ కంట్రోల్ సెంటర్‌, చోరీ దృశ్యాలను పరిశీలించామన్నారు. నిందితుడు రవికుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, HYD, తిరుపతిలో ఆస్తులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసుపై DEC 2న హైకోర్టుకు నివేదిస్తామని తెలిపారు.

Similar News

News November 6, 2025

20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

image

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్‌ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.

News November 6, 2025

వ్యాధులపై అపోహలు.. వైద్యుల హెచ్చరిక!

image

సాధారణ వ్యాధులపై ఉన్న అపోహలను వైద్యులు తోసిపుచ్చారు. స్ట్రోక్ వృద్ధులకే కాకుండా హై BP ఉన్న యువతకూ రావచ్చని తెలిపారు. ‘గుండెపోటు ప్రతిసారీ తీవ్రమైన నొప్పిని కలిగించదు. ‘సైలెంట్ అటాక్స్’ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్స్ జలుబు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లకు పని చేయవు. హైబీపీ ఉన్నట్టు లక్షణాలు కనిపించవు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిందే. కొన్ని లక్షణాలు తగ్గాయని మెడిసిన్స్ ఆపొద్దు’ అని వైద్యులు స్పష్టం చేశారు.

News November 6, 2025

ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

image

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.