News November 6, 2025

GDWL: మామిడి రైతులకు సూచనలు

image

జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలను సాగు చేసే రైతులు నవంబర్ నెలలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. ఈ నెలలో తేనె మంచు, పిండి నల్లి, పొలుసు పురుగులు పంటలను ఆశ్రయిస్తాయన్నారు. పాదులు చేసి చెట్ల మొదలు చుట్టూ పాలిథిన్ పేపర్‌ను అడుగు ఎత్తున కట్టి దానికి జిగురు పూయాలన్నారు. ఫలితంగా పురుగులు పైకి పాకకుండా నియంత్రించవచ్చని సూచించారు.

Similar News

News March 20, 2026

రంజాన్‌కు పటిష్ట భద్రత: సీపీ సునీల్‌ దత్

image

ఖమ్మం: రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి గోళ్లగూడెం ఈద్గాను సందర్శించారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈద్గా నిర్వాహకులతో మాట్లాడి సౌకర్యాలను సమీక్షించారు.

News March 20, 2026

మదనపల్లె: ఘోరం.. ఇద్దరు చిన్నారుల మృతి

image

మదనపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు మండలం బల్తమూరుకు చెందిన శ్రీనివాసులు చీకిలబైలులో ఉంటున్నారు. వాళ్ల కుమారుడు కుశల్ రెడ్డి(10)తో పాటు తమ్ముడు కుమారుడు భువనేశ్వర రెడ్డి(6) బెంగళూరులో చదువుతున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీనివాసులురెడ్డి పిల్లలను బైకుపై తీసుకుని ఇంటికి బయల్దేరాడు. చీకిలబైలు వద్ద లారీ ఢీకొని ఇద్దరూ చనిపోయారు.

News March 20, 2026

ANUలో BFA 1వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో BFA 1వ సెమిస్టర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. 17 మందిలో 16 మంది ఉత్తీర్ణులు (94.12%) సాధించారు. రీవ్యాల్యూయేషన్‌కు మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, మార్చి 31లోపు పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలని పరీక్షల కార్యనిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాద్ రావు తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ. 2070, పర్సనల్ వెరిఫికేషన్ రూ.2190 గా వుందని వెల్లడించారు.