News November 6, 2025

చాప్‌మన్ విధ్వంసం.. 28 బంతుల్లో 78 రన్స్

image

విండీస్‌తో రెండో T20లో కివీస్ బ్యాటర్ చాప్‌మన్ విధ్వంసం సృష్టించారు. 28 బంతుల్లోనే 78 పరుగులు చేశారు. ఇందులో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో NZ తరఫున ఒక T20Iలో అత్యధిక స్ట్రైక్‌రేటు(279)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 20 ఓవర్లలో 207-5 స్కోర్ చేయగా, WI 204-8 స్కోరుకు పరిమితమై ఓడిపోయింది. పావెల్ 45(16B), షెఫర్డ్ 34(16B), ఫోర్డే 29(13B) రన్స్ చేసినా ఫలితం లేకపోయింది.

Similar News

News March 18, 2026

PHOTOS: ‘దివ్యాంగ శక్తి’ ప్రారంభోత్సవం

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి 11 కి.మీ. బస్సులో ప్రయాణించారు. వారి బాగోగులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అంతకుముందు సీఎం తన నివాసంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు. ఆ కార్యక్రమ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News March 18, 2026

రాత్రి 9 గం. నుంచి ధురంధర్-2 తెలుగు షోలు

image

ధురంధర్-2 సినిమా ప్రీమియర్ షోలపై డైరెక్టర్ ఆదిత్య ధార్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు 9PMకు తెలుగు ప్రీమియర్ షోలు ప్రారంభం అవుతాయని ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా హిందీ షోలు సా.5 గం.కే ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల మలయాళం, కన్నడ షోలు రేపు ఉదయం నుంచి ప్రారంభం అవుతాయన్నారు.

News March 18, 2026

సీఎస్ పదవీ కాలం మరోసారి పొడిగింపు

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీకాలాన్ని కేంద్రం మరో 3 నెలలు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమాచారం అందించింది. గతంలో ఆయన పదవీకాలాన్ని 7 నెలలు పొడిగించగా ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలలు పొడిగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది.