News November 6, 2025

తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

image

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

Similar News

News March 25, 2026

బొలిశెట్టికి మా పార్టీతో సంబంధం లేదు: జనసేన

image

బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. కావున బొలిశెట్టి చేపట్టే కార్యక్రమాలకి జనసేన పార్టీకి సంబంధం లేదన్నారు.

News March 25, 2026

జూరాల – ఆత్మకూరు రాకపోకలు బంద్

image

దిగువ జూరాల జెన్కో యూనిట్ల నుంచి టర్బైన్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేయడంతో గద్వాల – ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ఉద్ధృతి పెరగడంతో ప్రయాణికుల రక్షణార్థం పోలీసులు బుధవారం రోడ్డును మూసివేశారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైన ఈ దారి మళ్లీ మూతపడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

News March 25, 2026

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నల్లి పోసియ్య

image

పెంటపాడు ప్రభుత్వ పాఠశాల వృక్ష శాస్త్ర ఉపాధ్యాయుడు నల్లి పోసియ్య రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం తణుకులో జరిగిన జిల్లా స్థాయి 45 ఏళ్ల విభాగం జావెలిన్ త్రోలో ఆయన ప్రథమ స్థానం సాధించారు. తద్వారా ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న పోటీలకు అర్హత పొందారు. ఆయనను ఎంఈfyలు శ్రీనివాస్, రామకృష్ణ ఘనంగా అభినందించారు.