News November 6, 2025

ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్‌ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.

Similar News

News March 31, 2026

తొలిసారి ధోనీ, రైనా లేకుండా..

image

IPL-2026 సీజన్‌లో నిన్న తొలి మ్యాచ్ ఆడిన CSK రాజస్థాన్ చేతిలో <<19519904>>ఘోర<<>> ఓటమిపాలైంది. అయితే 277 మ్యాచుల తర్వాత ధోనీ, రైనా లేకుండా ఆ జట్టు బరిలోకి దిగడం గమనార్హం. ఇందులో 253 IPL, 24 ఛాంపియన్స్ లీగ్ T20 మ్యాచులున్నాయి. వీటన్నింటిలోనూ ధోనీ లేదా రైనా ఉన్నారు. IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా, 2021లో చివరి మ్యాచ్ ఆడారు. ఇక <<19508727>>గాయం<<>> కారణంగా ఈ సీజన్‌లో కొన్ని మ్యాచులకు ధోనీ దూరమయ్యారు.

News March 31, 2026

అడుగంటిన నీటి నిల్వలు.. శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

image

AP: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 44 TMCల నీరే ఉంది. దీంతో ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. గత పది నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.

News March 31, 2026

జాగ్రత్త.. పిడుగులతో వర్షాలు, తీవ్ర వడగాల్పులు

image

APలో ఇవాళ భిన్న వాతావరణం ఉండనుంది. ద్రోణి ప్రభావంతో SKL, అల్లూరి, పోలవరం, KNL, నంద్యాల, VZM, మన్యం, VSKP, నెల్లూరు, ATP జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని APSDMA తెలిపింది. మన్యం, పోలవరం, విజయనగరం, తూ.గో, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది.