News November 6, 2025

గోదావరిఖని: ‘గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలి’

image

సింగరేణి గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలని సీఐటీయూ-ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడారు. గతంలో లాభాల విషయంలో సీఎంతో కలిసి చెక్కులు ఇచ్చి, బయటకు వచ్చి ఖండిస్తున్నామన్నారని తెలిపారు. ఇప్పుడు 100 నుంచి 150 మస్టర్లకు పెంచిన అంశాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటనలు చేసి, కార్మికుల వ్యతిరేకతతో ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.

Similar News

News March 14, 2026

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్: సీపీ

image

నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. పరీక్షా సమయాల్లో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News March 14, 2026

రారండోయ్..

image

నేడు, రేపు చారిత్రక <<19377870>>గుత్తి కోట<<>> ఉత్సవాలు
★ శనివారం సా.5:30కు కార్యక్రమం మొదలు
★ 5:45 గంటలకు జిల్లా కలెక్టర్ ఆనంద్ స్వాగత ప్రసంగం
★ 6:32 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి శివతాండవం
★ 6:45 గంటలకు గుత్తి కోట చరిత్రపై గజల్ ప్రోగ్రాం
★ 7:16 గంటలకు సక్కనైన వాడు.. ఫోక్ డాన్స్
★ 7:36 గంటలకు ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఫ్యూజన్
★ 8:21 గంటలకు ప్లేట్ సాంగ్
★ 8:30 గంటలకు కృష్ణవేణి టీం వారి రేలా రే రేలా

News March 14, 2026

భూపాలపల్లిలో 3,544 మంది టెన్త్ విద్యార్థులు

image

కాసేపట్లో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పరీక్షా కేంద్రాల్లో 3,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 1,843 మంది బాలికలు, 1,701 మంది బాలురు ఉన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష సమయం కాగా, విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు