News November 6, 2025

పెద్దపల్లిలో రోడ్ సేఫ్టీ పనుల స్థల పరిశీలన

image

PDPLబస్టాండ్, అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్ సేఫ్టీ పనులను గురువారం మున్సిపల్, RTC, ట్రాఫిక్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు బస్సులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు రోడ్ వెడల్పు, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. RTC అధికారులతో చర్చించి పనులు ప్రారంభిస్తామన్నారు.

Similar News

News March 20, 2026

కొత్త ఫోన్లలో ఆధార్ యాప్?

image

కొత్త మొబైల్స్‌లో డిఫాల్ట్‌గా ఆధార్ యాప్‌ను తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. యూజర్లు న్యూ మొబైల్ ఆన్ చేసినప్పుడే ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ఈ ఏడాది జనవరిలో ఈ-మెయిల్ చేసింది. అయితే ఈ ప్రతిపాదనను యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ తిరస్కరించాయి.

News March 20, 2026

తెలంగాణ తలసరి ఆదాయం ₹4,18,931

image

* రెవెన్యూ వ్యయం: ₹2,34,406 కోట్లు
* మూలధన వ్యయం: ₹47,267 కోట్లు
* తలసరి ఆదాయం: ₹4,18,931 (జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.9% ఎక్కువ)
* రాష్ట్ర వృద్ధి రేటు: 10.2% (జాతీయ వ‌ృద్ధి రేటు కంటే 2.7% ఎక్కువ)
* GSDP: ₹17.82 లక్షల కోట్లు

News March 20, 2026

NTR: 23తో ముగియనున్న గడువు..త్వరపడండి

image

కృష్ణా వర్సిటీలో పీజీ 4వ సెమిస్టర్ విద్యార్థులు రాయాల్సిన MOOCS (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్)పరీక్షలను ఏప్రిల్ 29న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. మార్చి 23లోపు ఈ పరీక్ష రాసే విద్యార్థులు రూ. 250 ఫీజును http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందన్నాయి. MOOCS పరీక్ష పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చని సూచించాయి.