News November 6, 2025
సమగ్ర సవరణకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సీఈవో వివేక్ యాదవ్.. సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి ఆయన కాకినాడ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు.
Similar News
News March 12, 2026
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా జరపాలి: AISF

భద్రాద్రి జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని AISF జిల్లా ప్రధాన కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించాలని కోరారు. వేలాది మంది భవిష్యత్తు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News March 12, 2026
సీఎం కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల 2వ రోజు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ప్రగతి, అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ సీఎంకి వివరించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News March 12, 2026
గ్యాస్ సిలిండర్ల కోసం కంగారు వద్దు: జేసీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ కొరత ఉండదని జేసీ నిశాంతి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చర్యల మూలంగా గృహ వినియోగదారులకు యథావిధిగా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్యాస్ సరఫరాపై పలు సూచనలు చేశారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.


