News November 6, 2025
విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తాం: రామ్మోహన్

AP: ప్రపంచంలో రోజూ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని, దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. <<18216721>>సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్<<>> కోసం ఢిల్లీలో పర్యటిస్తోన్న స్టూడెంట్లతో ఆయన ముచ్చటించారు. విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చడానికి బాటలు వేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సక్సెస్ కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 18, 2026
ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
News March 18, 2026
త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
News March 18, 2026
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం: సీఎం

TG: అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై చర్చ జరగాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు హాజరుకాకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రైజింగ్ తెలంగాణ-2047 డాక్యుమెంట్‌ను కూడా ప్రతిపక్ష సభ్యులు చదవలేదని విమర్శించారు.


