News November 6, 2025

సిద్దిపేట: ‘విధుల్లో అలసత్వం వద్దు’

image

సిద్దిపేట జిల్లా కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నిర్వహించిన పనితీరును(ప్రగతి) రివ్యూ నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా ఆస్పత్రుల్లో పేషెంట్లకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి అలసత్వం లేకుండా వైద్య సేవలు నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని చెప్పారు. డ్యూటీ విషయంలో సమయపాలన పాటించాలని చెప్పారు.

Similar News

News March 29, 2026

శ్రీ సత్యసాయి: అక్రమ సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడు!

image

కొత్తచెరువులోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న మీనాక్షి తన భర్త శ్రీనివాసులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసినట్లు సీఐ మారుతి శంకర్ శనివారం తెలిపారు. వేరే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తనపై దాడి చేసి, గాయపరిచాడని ఫిర్యాదులో తెలిపిందన్నారు. గృహహింస కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

News March 29, 2026

పశ్చిమాసియా యుద్ధానికి నెల.. కీలక ఘటనలు

image

*FEB 28- సుప్రీం లీడర్ ఖమేనీ హతం. స్కూల్‌పై మిస్సైల్ పడటంతో చిన్నారులు సహా 170 మంది మృతి
*MAR 2- హార్ముజ్ జలసంధి మూసివేత. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు
*MAR 8- కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఎన్నిక
*MAR 16- ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతం
*MAR 18- ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి
*MAR 21- హార్ముజ్ తెరవాలని ట్రంప్ అల్టిమేటం

News March 29, 2026

ఒంటిమిట్టకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

బుధవారం జరగనున్న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణానికి CM చంద్రబాబు రానున్నారు. బుధవారం సా.4:15 గం. ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
▶ 4.30-6:05: TTD గెస్ట్ హౌస్‌లో రెస్ట్
▶ 6:15-6:30: స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
▶ 6:35: సీతారామయ్య కళ్యాణ వేదికకు చేరుకుంటారు
▶ 6:45-8:30: తలంబ్రాలు సమర్పించి కళ్యాణాన్ని తిలకిస్తారు
▶ 8:40: TTD గెస్ట్ హౌస్‌‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.