News November 6, 2025

ఎలమంచిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఎలమంచిలి (M) కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివకాల మేరకు.. S రాయవరం (M) సర్వసిద్ధికి చెందిన అడబాల సాయిరామ్ గోవింద్ బైక్‌పై వెనుక కూర్చుని గ్రామం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. సాయిరాం కింద పడిపోగా అతనిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందు సురక్షితంగా బయటపడ్డాడు.

Similar News

News March 22, 2026

నర్మెటకు చేరుకున్న సీఎం

image

సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి హాజరయ్యారు. సీఎం టీజీ ఆయిల్ పామ్ కార్మాగారాన్ని ప్రారంభించి, రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు.

News March 22, 2026

ఈ నెల 25న కాంగ్రెస్‌కు గుడ్‌బై: జీవన్ రెడ్డి

image

TG: ఈ నెల 25న కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.

News March 22, 2026

HYD: కుప్పకూలిన బాల్కానీ స్లాబ్.. తండ్రీకొడుకుల మృతి

image

పంజాగుట్ట PS పరిధిలోని కుందన్‌బాగ్ శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని బాల్కనీ పొడిగింపు కోసం ఐరన్ రాడ్‌లతో నిర్మించిన భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఎలక్ట్రిషియన్ పనికోసం వచ్చిన తండ్రీకొడుకులు వివేక్, దేవిదాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి యజమాని ద్వారకా ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.