News November 6, 2025

మెట్‌పల్లి: రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: అదనపు కలెక్టర్

image

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ లత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వాతావరణ మార్పు దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ అన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఎమ్మార్వో, ఏపీఎం, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

Similar News

News March 5, 2026

మహబూబాబాద్‌ నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

image

మహబూబాబాద్ జిల్లాకు రాజకీయంగా అరుదైన గుర్తింపు లభించింది. కాంగ్రెస్ నుంచి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఖరారు కావడంతో జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఒకే జిల్లా, అది కూడా ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లడం విశేషం.

News March 5, 2026

పార్వతీపురం: ‘యుద్ధప్రాతిపదికన డోలీ రోడ్లు పూర్తి చేయాలి’

image

పార్వతీపురం మన్యం జిల్లాలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా చేపడుతున్న డోలీ రోడ్లన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో గురువారం కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. పనుల్లో నిర్లిప్తత పనికిరాదని, అలాగే నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నాణ్యత, పారదర్శకతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News March 5, 2026

ప.గో: రూ. 3 కోట్ల విలువైన బంగారంతో వ్యాపారి పరారీ

image

ఆభరణాలు తయారు చేస్తానని నమ్మించి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సిసిర్ బేగ్ తణుకులో పలువురు మహిళల నుంచి సేకరించిన సుమారు రూ. 3 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించాడు. జనవరి 9 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారని, ఇప్పుడు నిందితుడు ఐపీ నోటీసులు పంపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.